ETV Bharat / sitara

NTR Jayanthi: సినిమానే దేవాలయం.. ప్రేక్షకులే దేవుళ్లు - ఎన్టీఆర్ కెరీర్

తెలుగు తెరపై తన పేరును శాశ్వతంగా ముద్రించుకుని.. నట సౌర్వభౌముడిగా.. యుగపురుషుడిగా ఖ్యాతి గడించిన నందమూరి తారకరామ రావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా పరిశ్రమ, సినిమా నిర్మాణం, నటుల గురించి ఎన్టీఆర్​ చెప్పిన విలువైన అభిప్రాయాలు మీకోసం.

ntr
ఎన్టీఆర్
author img

By

Published : May 28, 2021, 7:00 AM IST

Updated : May 28, 2021, 8:59 AM IST

"సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు" అని ప్రయాణం సాగించిన నందమూరి తారకరామారావు (NT Rama Rao) తొలుత "సినిమానే దేవాలయం.. ప్రేక్షకులే దేవుళ్లు" అని భావించేవారు. నిర్మాత ఈ రెండింటి మధ్య అనుసంధానకర్త అని చెప్పేవారు. అందుకే "నిర్మాత బాగే.. సినీ పరిశ్రమ బాగు" అని తలచేవారు. ప్రేక్షకులు వెండితెర ఇలవేల్పుగా అభిమానించే ఎన్టీఆర్‌ జయంతి ఈరోజు. ఈ నేపథ్యంలో పరిశ్రమ, సినిమా నిర్మాణం, నటుల గురించి ఎన్టీఆర్​ చెప్పిన విలువైన అభిప్రాయాలు మీకోసం.

'నిర్దోషి' చిత్రం శతదినోత్సవం సందర్భంగా గుంటూరు వచ్చారు ఎన్టీఆర్‌. అక్కడి గాడీపేటలోని 'నాదేశం' పత్రిక సంపాదకులు శీలానంద్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నందమూరి తారకరామారావు వెలిబుచ్చిన అభిప్రాయాల సారం ఆయన మాటల్లోనే..

  • మనం 'టెన్‌కమాండ్మెంట్స్‌' (Ten Commandments) లాంటి సినిమాలు తీయనవసరం లేదు. సాధారణమైన కథతో చక్కని సినిమాలను సరైన సమయానికి ముగించి నిర్మాత జేబుకి చిల్లు పెద్దది కాకుండా చేయకుంటే చాలు. టెన్‌కమాండ్మెంట్స్‌ లాంటి సినిమాలు చేయాలన్న ఉత్సాహం వేరు.. దాన్ని తీయడానికి కావలసిన అనుభవం అంతకంటే భిన్నం అని నా నమ్మకం. ఎంతమంది నిర్మాతలు నష్టపోతున్నా నిత్య పెళ్లికొడుకు మన సినిమా పరిశ్రమ. మా రోజుల్లో లాభాలు వచ్చే సినిమాలు అరవై శాతానికి పైగానే ఉండేవి. ప్రస్తుతం ఇది పది శాతానికి మించడం లేదు.
    ntr
    ఎన్టీఆర్
  • ప్రజాదరణ పొందిన అన్ని విజయవంతమైన సినిమాలను నిశితంగా పరిశీలిస్తే ఒకే ఒక సత్యం గోచరం అవుతుంది. వాటి కథలన్నీ ఒక నిర్దిష్టమైన మార్గంలో ఒకే గుడ్డగా నేయబడ్డాయని. వాటిలో పరభాషా చిత్రాల అనుకరణలు-సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. అంటే అటువంటి సినిమాల్లో అచ్చ తెలుగుదనం అనే సహజ గుణం పూల చెండులో దారంలా దాగి ఉండటమే. ఒక భారవి, జయసింహ, ఇల్లరికం, సంసారం, పెళ్ళి చేసి చూడు, గుండమ్మ కథ, పాతాళభైరవి, మాయాబజార్‌, మల్లీశ్వరి, భక్త పోతన, వంటి ఆణిముత్యాలు నిష్కారణంగా విజయాలు సాధించలేదు. వీటి వెనుక నిర్మాతల అదృష్టం లేదు కానీ విలువలతో కూడిన సహజమైన కథ ఉంది. మన తెలుగు సంప్రదాయానికి అనుగుణమైనది, విరుద్ధం కానిదీ అయిన ఏ కథ అయినా విజయాన్ని సాధిస్తుందని గట్టిగా చెప్పగలను.
  • నిమిషాల విలువను ముందుగా లెక్క కట్టుకున్నవాడే అసలు, సిసలైన నిర్మాతగా ఎదగగలరు. నేటి చిత్రాల పరాజయం వెనుక పలు కారణాలు ఉన్నాయి. వాటిలో తీసిన సన్నివేశాల ఆధారంగా తరువాతి కథను సెట్స్‌ పైనే రాసుకోవడం, సెట్స్‌ పైనే డైలాగులు రాయడం, సెట్స్‌ పైనే సీక్వెన్స్‌ ఆలోచించడం వంటివి.
    NTR
    సన్నివేశాన్ని కెమెరాలో చూస్తూ..
  • సినిమారంగంలో కాలం విలువ అమోఘం. ఇక్కడ కాలం విలువ తెలియకపోతే నిర్మాత డబ్బు హారతి కర్పూరం కన్నా, కాలం కన్నా వేగంగా ఆవిరై పోతుంది. కాలం గురించి ప్రస్తావన ఎందుకంటున్నానంటే సినిమా టెక్నాలజీ వచ్చిన కొత్తలో హ్యాండ్‌ క్రాకింగ్‌ కెమెరాతో సినిమాను ముగించడానికి 15 కాల్షీట్స్‌ అవసరం అయ్యేవి. అంటే ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని మా రోజుల్లోనే సినిమా నిర్మాణం అతి వేగంగా పూర్తి అయ్యేది. తెలుగు సినిమా మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు అంటే మాలపిల్ల, మళ్ళీ పెళ్లి, వందేమాతరం వంటి చిత్రాలు 45 కాల్షీట్లలో ముగిసేవి. నేడు మనం ఎంతో ఉన్నతమైన టెక్నాలజీ యుగంలో ఉన్నా, ఒక సినిమాకి టోకున 150 కాల్షీట్స్‌పైనే అవసరం అవ్వడం చూస్తుంటే బాధ కలుగుతోంది. అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది మనం ముందుకు వెళుతున్నామా? లేక వెనక్కా? అని.. దీనికి మనమంతా బాధ్యులమే.
  • సినిమా స్క్రిప్ట్‌ అనేది మన రాజ్యాంగంలా సర్వ సన్నద్హమై ఉండాలంటాను నేను. నిర్మాత నుంచి డబ్బు పుచ్చుకునేటప్పుడు ఆయనకు ఇస్తామన్న దానిని అణా -పైసా లెక్కన మనం ఇచ్చి తీరాల్సిందే. అది నటనైనా, సంగీతమైనా, గాత్రమైనా సరే.. నిర్మాత మనలని నమ్మి పని ఇచ్చినపుడు అది నిర్మాత పనిలే అన్న నిర్లక్ష్యం ఎందరిలోనో చూశాను నేను. కానీ అలా భావించడం తప్పంటాను.
    ANR, NTR
    ఏఎన్నార్​కి మేకప్ వేస్తూ..
  • డబ్బును పెట్టుబడిగా పెట్టడమే నిర్మాత అర్హత కాదని మనం హాలీవుడ్‌ నిర్మాతలను చూసి గ్రహించాల్సి ఉంది. అక్కడి నిర్మాతకు కాస్తో-కూస్తో సినిమా పరిజ్ఞానాలున్నాయి. ఇక్కడి పరిస్థితి అందుకు వ్యతిరేకం. మన నిర్మాతల పట్ల ఇది నేను చేస్తున్న విమర్శ కాదని నా మనవి. మళ్లూ -మాన్యాలను అమ్ముకొని మద్రాసు చేరుకొనే పలు నిర్మాతల పట్ల జాలితో-బాధతో ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఎందుకంటే మాకు ఇంత అన్నం పెట్టె నిర్మాతలు మా పాలిట దేవుళ్లు కనుక. అవగాహన లేని నిర్మాతలు చిత్రాలు తీస్తే నష్టం ఆయన ఒక్కడికే కాదు, ఆ సినిమాలకు పనిచేసిన అందరికీ. అది వారి భవిష్యత్తుపైనా పడుతుంది. నిర్మాత ఆర్థికంగా నష్టపోతాడు.. కానీ ఆ సినిమాకి పనిచేసిన వారి సంపూర్ణమైన కృషి వృథా అవుతుంది. విమర్శలకు నోచుకుంటారు. కొత్త నిర్మాత దృష్టిలో సదరు బృందాన్ని పెట్టుకుంటే నష్టపోతామని భావన కలుగుతుంది. అందుకే చిత్ర నిర్మాణంపై సరైన అవగాహన లేకుండా డబ్బు కుమ్మరించడం వలన ఒరిగేది ఏమిటనేది నా విచారం.
  • సినిమా అంటే ఒక లాటరీ-జూదం-స్పెక్యులేషన్‌ అనుకుంటూ నిర్మాణానికి ఉపక్రమించేవారు చివరకు.. 'ప్రేక్షకులకి మన సినిమా అర్థం కాలేదనే' వాదనతో సరిపుచ్చుకుంటారు. కానీ వాస్తవానికి ఇటువంటి నిర్మాతలు గ్రహించాల్సిన సత్యం ఏమంటే ‘ప్రేక్షకులను తాము సరిగా అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యామని’. చిత్రం తాలూకు అపజయాలను ప్రేక్షకుల మీదకి రుద్దే ముందు నిర్మాతలు తెలుసుకోవలసింది మరొకటుంది.. 'వారు వారి బాధ్యతలను-హక్కులనూ సరిగా అర్థం చేసుకోలేదని'.

Last Updated : May 28, 2021, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.