'నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు వీర నాటు' అంటూ 'ఆర్‌ఆర్‌ఆర్'లో (naatu naatu song reaction) రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు చూపుతిప్పుకోనివ్వకుండా ఉన్నాయి కదూ!(ntr ram charan rrr movie) అదే రీతిలో పాట కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ 'నాటు నాటు' పాట స్టెప్స్ కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చెప్పారు తారక్. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకింగ్ విషయాలను ఇలా తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
15-18 టేక్స్ తీసుకున్నాం!
"నాటు నాటు పాటలోని హుక్ స్టెప్.. కాళ్లు ఎడమ, కుడి, ముందు, వెనుక తిప్పి స్టెప్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యేందుకు నేను చెర్రీ, 15-18 టేక్స్ తీసుకున్నాం. ఈ విషయంలో రాజమౌళి ఇద్దరికీ నరకం చూపించారు (నవ్వుతూ). ముఖ్యంగా ఇద్దరిదీ ఒకే తీరులో వస్తుందా అని తెలుసుకునేందుకు మధ్యమధ్యలో డ్యాన్స్ స్టెప్స్ ఆపేసేవారు. అలా.. నాదీ, చెర్రీది చేతుల, కాళ్ల కదలికలు సింక్ అవుతున్నాయా లేదా అని చూసుకునేవారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌లో ఈ పాటను చిత్రీకరించాం. ఇక ఈ లిరికల్ వీడియోలోని డ్యాన్స్ స్టెప్స్‌కు వచ్చిన విశేష స్పందన చూశాక.. రాజమౌళి విజన్ మాకు అర్థమైంది. అందరూ ఆ హుక్ డ్యాన్స్ స్టెప్స్ సింక్ బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. అప్పుడే జక్కన్నను(rajamouli RRR movie) పిలిచి అడిగా ఇది మీకు ఎలా సాధ్యమైందని.. జక్కన ఓ టాస్క్ మాస్టర్. అందుకే భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ దర్శకుడు అయ్యారు" అని అన్నారు.
ఇదీచూడండి: