ETV Bharat / sitara

ట్రైలర్: బాండ్​ను భయపెట్టే విలన్​ 'సఫిన్' - no time to die movie

జేమ్స్ బాండ్ కొత్త చిత్రం 'నో టైమ్ టు డై' నుంచి మరో ట్రైలర్​ విడుదలైంది. ఇందులో బాండ్​కు దీటైన విలన్​గా కనిపించనున్న రామి మాలెక్​ పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం.

Rami Malek
రామి మలేక్​
author img

By

Published : Sep 15, 2020, 4:56 PM IST

జేమ్స్‌ బాండ్‌ సినిమా అంటే ప్రేక్షకులకు ఓ ఎమోషన్‌. ఇప్పటికే విడుదలైన ఈ ఫ్రాంచైజీలోని చిత్రాలు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు 'నో టైమ్ టు డై' చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. తాజాగా సినిమాలోని విలన్​ క్యారక్టర్​ సఫిన్​ను పరిచయం చేస్తూ చిత్రబృందం మరో ట్రైలర్​ను విడుదల చేసింది. ఇందులో ఆస్కార్​ విజేత రామి మాలెక్ ​ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సందర్భంగా సఫిన్​ పాత్ర గురించి దర్శకుడు కేరీ జోజీ మాట్లాడుతూ.. "అతను చేసే ప్రతి పని, కోరిక వ్యక్తిగతంగా బాండ్​తో పాటు ప్రపంచాన్ని భయపెట్టే విధంగా ఉంటుంది. అంతటి బలమైన పాత్ర ఇది. ఇందులో విలన్​ ఎప్పుడూ తనను తాను హీరోగా భావిస్తాడు" అని పేర్కొన్నాడు.

డేనియల్‌ మరోసారి బాండ్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకు కేరీ జోజీ ఫకునగా దర్శకత్వం వహిస్తున్నాడు. లా సేడోక్స్‌, బెన్‌ విషా, నవోమీ హారిస్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు. నవంబరులో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.