బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో భాగంగా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు ఊరట లభించింది. ఈ యువ హీరో ఖాతా నుంచి భారీ మొత్తం వేరే అకౌంట్కు బదిలి అయ్యిందని ఫిర్యాదు అందిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవలే దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తికి రూ. 15 కోట్లు బదిలీ అయ్యాయని ఆరోపణల నేపథ్యంలో.. ఈడీ ఆ దిశగా రియాను, ఆమె కుటుంబసభ్యులను విచారించింది.
అయితే సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ అవ్వలేదని వివరణ ఇచ్చారు ఈడీ అధికారులు. కేవలం రూ. 55 లక్షల లావాదేవీ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. అయితే ఆ మొత్తం ఎవరికీ బదిలీ అయ్యాయి? కారణాలేంటి? వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది.
సుశాంత్ తండ్రి కృష్ణ కిశోర్ సింగ్ పట్నా పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
ఇది చూడండి థియేటర్లలోనే రవితేజ 'క్రాక్' సందడి