ETV Bharat / sitara

'నో పెళ్లి' అంటున్న సాయి ధరమ్ తేజ్ - No pelli song

సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'నో పెళ్లి' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.

సాయి
సాయి
author img

By

Published : May 25, 2020, 5:10 PM IST

హుషారైన చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న యువనటుడు సాయిధరమ్‌ తేజ్‌. గతేడాది 'ప్రతిరోజూ పండగే' చిత్రంతో మెప్పించిన సాయి ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్‌' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన 'నో పెళ్లి' అంటూ సాగే పాట ఈరోజు విడుదలైంది.

నభా నటేష్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్రం ఎల్‌ఎల్‌పీ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. తమన్‌ సంగీతం అందించిన ఈ పాటను ప్రముఖ హీరో నితిన్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశాడు. కాగా ఈ పాటలో వరుణ్​ తేజ్, రానా కూడా దర్శనమిచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాయిధరమ్‌ని ఉద్దేశించి నితిన్‌.. "ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తా.. కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్‌ గ్యాప్‌ ఉంటుందేమో కానీ చేసుకోవడం పక్కా" అంటూ వ్యాఖ్యానించాడు. ఇక సాయిధరమ్‌ తేజ్​ ఈ పాటను ‘పెళ్లికాని వారందరికీ అంకితం ఇస్తున్నట్లు’’ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.