ETV Bharat / sitara

'సుశాంత్ కేసులో మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు'

author img

By

Published : Sep 4, 2020, 7:43 AM IST

సుశాంత్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే స్పందించిన సీబీఐ.. ఈ కేసు విషయమై మీడియాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అధికారిక ప్రకటన ఇచ్చింది.

'సుశాంత్ కేసులో మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు'
సుశాంత్ సింగ్ రాజ్​పుత్

సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మృతి కేసులో బాలీవుడ్​కు మాదకద్రవ్యాలకు మధ్య ఉన్న చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్​సీబీ) తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. అరెస్టయిన వ్యక్తి కైజన్ ఇబ్రహీం అని, అతడు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారని తెలిపింది. సుశాంత్ కేసులో ఎన్​సీబీ, ఇప్పటికే బాసిత్ పరిహార్, జాయిద్ విలత్రా(21)లను అరెస్టు చేసింది. ఇప్పుడు అరెస్టయిన కైజన్​కు పరిహార్​తో సంబంధాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల మరో కేసులో అబ్బాస్ లఖానీ, కరణ్ అరోరాలను ఎన్​సీబీ గతంలో అరెస్టు చేసింది. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో లఖానీ ద్వారా జాయిద్​కు, అతడి ద్వారా పరిహార్​కు లింకులు ఉన్నట్లు వెల్లడైంది.

SUSHANTH- NCB
సుశాంత్- మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ

కైజన్ ఇబ్రహీంకు బాలీవుడ్​ హీరో సుశాంత్ ప్రియురాలు రియాకు మధ్య మాదక ద్రవ్యాలకు సంబంధించిన చాటింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రియా రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నుంచి తొలగించిన సమాచారాన్ని తిరిగి రాబట్టగలిగారు. ఆయా ఫోన్లలోని మెసేజ్​లు, చాటింగ్​ల ఆధారంగా నిషేధిత మత్తు పదార్థాల వాడకంతో రియాకు సంబంధాలు ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. ఈ కేసుకు మహారాష్ట్రతో పాటు దిల్లీ, గోవాలలోనూ లింకులు ఉన్నట్లు అనుమానిస్తూ, ఆయా రాష్ట్రాల్లోనూ దర్యాప్తు చేస్తోంది.

మీడియా సంయమనం పాటించాలి

సుశాంత్ కేసులో మీడియా సంయమనం పాటించాలని బొంబాయి హైకోర్టు గురువారం సూచించింది. ముంబయి పోలీసులకు వ్యతిరేకంగా మీడియా అసత్య కథనాలను ప్రసారం చేస్తోందని పేర్కొంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీడియా తీరు కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉందని అందులో పేర్కొన్నారు. సుశాంత్ కేసులో ఏ విధమైన సమాచారాన్ని మీడియాకు అందించలేదని పేర్కొంటూ సీబీఐ తొలిసారి అధికారికంగా ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.