ETV Bharat / sitara

'పేరొస్తుందంటే.. ఆ సినిమాల్లో కూడా నటిస్తా' - Nivetha Thomas latest movie updates

గ్లామర్​ పాత్రల కోసం స్కిన్​ షోకు ఎప్పటికీ సిద్ధపడనని అంటోంది నటి నివేదా థామస్​. ఇటీవలే వి చిత్రంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించిందీ ముద్దుగుమ్మ.

Nivetha Thomas
నివేదా థామస్
author img

By

Published : Oct 7, 2020, 7:51 AM IST

చక్కని ఆహార్యాభినయంతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్​ నివేదా థామస్​. ఇటీవలే 'వి' చిత్రంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించి మెప్పించింది. అయితే గ్లామర్​ పాత్రల కోసం స్కిన్ షోకు ఎప్పటికీ సిద్ధపడనని అంటోంది ఈ భామ. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. గ్లామర్ పాత్రల పట్ల మీ ఆలోచనలు ఎలా ఉంటాయని అడగ్గా.. నివేదా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Nivetha Thomas
నివేదా థామస్

"గ్లామర్​ పాత్రలనే కాదు. ఏ పాత్ర ఎంపికలోనైనా నేను మొదట ఆలోచించేది ఒక్కటే. కథ వింటున్నప్పుడే కచ్చితంగా ఆ పాత్ర నేనే చేయాలి అనిపించాలి. తర్వాత అందులో కథ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? లేదా? అని బేరీజు వేసుకుని రంగంలోకి దిగుతా. ప్రత్యేకంగా గ్లామర్​ పాత్రలంటారా.. కావాలని స్కిన్​ షోకు సిద్ధపడను. ఎందుకంటే కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఫలానా సినిమాలో నటించా అని గర్వంగా చెప్పుకోవాలి. నటిగా నాకు పేరొస్తుందనిపిస్తే హారర్​ కథల్లో నటించడానికైనా సిద్ధమే.'' అని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.