'ఫలక్‌నుమా దాస్' చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. చివరగా 'హిట్'తో ప్రేక్షకులను అలరించారు. ఆయన కథానాయకుడుగా నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరనేదానిపై తాజాగా స్పష్టత ఇచ్చింది చిత్రబృందం. ఇందులో విశ్వక్తో నివేతా పేతురాజ్ రొమాన్స్ చేయనుంది.
ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే నివేతా సెట్లోకి అడుగు పెట్టనున్నారు. ప్రేమ, వినోదంతో కూడిన ఈ కథాంశం ప్రేక్షకులకి భిన్నమైన అనుభూతిని పంచుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి. 'చిత్ర లహరి', 'అల వైకుంఠపురములో' చిత్రాలతో ఆకట్టుకుంది నివేతా. రెండో నాయికగా మెరిసినా నటిగా మంచి గుర్తింపు పొందింది. తమిళంలోనూ బిజీగా ఉందీ అమ్మడు. విశ్వక్‌సేన్ సరసన ఎలా అలరిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాలి.