ETV Bharat / sitara

ప్రభాస్​ చిత్రంలో నివేదా థామస్​?

author img

By

Published : Aug 18, 2020, 9:26 PM IST

టాలీవుడ్​ హీరోయిన్​ నివేదా థామస్​.. దర్శకుడు నాగ్​ అశ్విన్​, హీరో ప్రభాస్​ కలయికలో రానున్న సినిమాలో నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

niveda in prabhas movie fans get excited
నివేదా థామస్​

ఎటువంటి పాత్రనైనా బిడియం లేకుండా పోషించి తన నటనతో పాటు, అందంతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్​ నివేదా థామస్​. చివరగా రజనీకాంత్​ 'దర్బార్​'లో కనిపించిన ఈ భామ.. ప్రభాస్​ హీరోగా దర్శకుడు నాగ్​ అశ్విన్​ తెరకెక్కిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇటీవలే నాగ్​ అశ్విన్​ నివేదాను కలిసి తన పాత్రను వివరించగా.. ఆమెకు విపరీతంగా నచ్చిందట. త్వరలోనే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

niveda in prabhas movie fans get excited
రాధేశ్యామ్​

ఈ ఏడాది ప్రారంభంలో ప్రభాస్​ 21వ చిత్రం ఖరారైనట్లు వైజయంతి మూవీస్​ అధికారికంగా ప్రకటించింది. పాన్​ ఇండియా సినిమాగా రూపొదించనున్నట్లు స్పష్టం చేసింది.సైన్స్​ ఫిక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె ఈ సినిమాలో డార్లింగ్​ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాతే నాగ్​ అశ్విన్​తో చిత్రం పట్టాలెక్కనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.