గతేడాది జులైలో తన ప్రేయసి షాలినిని పెళ్లిచేసుకున్న హీరో నితిన్.. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇప్పుడు తన కొత్త సినిమా 'రంగ్ దే' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పెళ్లికి ముందు, తర్వాత తన జీవితం ఎలా ఉందో వివరించారు. పెళ్లయ్యాక జీవితం చాలా మారిందని, ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
"వివాహానికి ముందు షూటింగ్‌లకు వెళ్లి వచ్చాక రిలాక్స్ కోసం షాలినితో మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు చిత్రీకరణలకు వెళ్లి వచ్చాక తనతోనే కలిసి గడపటం ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉంది. ఇప్పటివరకు మేమిద్దరం కలిసి ఎన్నో టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ సినిమాలు చూశాం. కానీ షాలిని అంతగా నా సినిమాలు చూడదు." అని నితిన్ అన్నారు.
నితిన్ నటించిన 'రంగ్ దే' సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించగా.. హీరోయిన్గా కీర్తిసురేశ్ నటించింది.
ఇదీ చూడండి: కీర్తి సురేశ్ మిస్సింగ్‌పై నితిన్ ట్వీట్.. హైదరాబాద్ పోలీస్ రిప్లై!