అశోక్ సెల్వన్, నిత్యా మేనన్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'నిన్నిలా నిన్నిలా'. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.