మెగా డాటర్ నిహారిక.. తన ప్రియుడు చైతన్యను, సోషల్ మీడియా వేదికగా ఇటీవలే పరిచయం చేసింది. గత కొంతకాలం ప్రేమలో ఉన్న వీరి నిశ్చితార్థం.. ఆగస్టు 12న జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరుకుటుంబాల సభ్యులు మాత్రమే హాజరు కానున్నారట.
ఈ ఏడాది డిసెంబరులో పెళ్లి ఉండనుందని సమాచారం. అయితే తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. చైతన్య ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నారు.