తన అన్న వరుణ్‌తేజ్‌కు నటి నిహారిక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. "అన్నయ్యా నువ్వు పిలిస్తే" లిరికల్ పాటను తన ప్రియమైన సోదరుడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. నటుడు నవీన్ చంద్రా, అవికా గోర్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం 'బ్రో'. అన్నాచెల్లెళ్లు మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలు తెలియజేసే విధంగా ఈ సినిమా తెరకెక్కింది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బ్రో' నుంచి రాఖీ పండుగను పురస్కరించుకుని తాజాగా ఓ లిరికల్ పాట విడుదలైంది. ప్రముఖ గాయని సునీత ఈ పాటను ఆలపించారు. "ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా" అంటూ సాగే ఈ పాట ప్రతిఒక్కర్నీ ఆకట్టుకునేలా ఉంది. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్‌చంద్ర స్వరాలు అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. వైష్ణవ్‌తేజ్ 'కొండపొలం'.. సెట్లోకి ఆలియా ఎంట్రీ