ETV Bharat / sitara

Valentine's day 2022: సినిమా కలిపింది వాళ్లిద్దరినీ! - Valentine's day 2022

Cinema stars love stories: కొందరు సినీ స్టార్స్.. రీల్ లైఫ్​లోనే కాకుండా రియల్ లైఫ్​లోనూ ప్రేమలో పడి సక్సెస్ అయ్యారు. ఇంతకీ వాళ్లెవరు? వారి సంగతేంటి?

valentains day 2022
వాలంటైన్స్ డే స్పెషల్ స్టోరీ
author img

By

Published : Feb 14, 2022, 12:26 PM IST

స్క్రీన్​పై ప్రేమతో జనం మనసుల్ని కనికట్టు చేసే నటీనటులు నిజంగానే ప్రేమలో పడిపోయారు. అడ్డంకులు దాటి.. పెద్దల్ని ఒప్పించి.. కెరీర్‌లో ఒడుదొడుకులు అధిగమించి.. చివరికి ఒకే గూటి పక్షులయ్యారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. ఆ ప్రేమకథలు షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా..

కాలేజీ వలపు

తెలుగు హీరో కార్తికేయది కాలేజీలో పుట్టిన ప్రేమ. ఎన్‌ఐటీ వరంగల్‌లో చదువుతున్నప్పుడే క్లాస్‌మేట్‌ లోహితకు ప్రపోజ్‌ చేశాడు. తను అంత తేలిగ్గా ఏం ఒప్పుకోలేదు. వెంటపడి, ఆరాధించి, బహుమతులిచ్చి, గుడ్‌బాయ్‌ అనిపించుకొని.. చివరికి మూడో సంవత్సరంలో ఓకే అనిపించుకున్నాడు. ఈ పదేళ్లలో ఇద్దరి మధ్య ఎన్నో అలకలు, గిల్లికజ్జాలు. అయినా మళ్లీ కలిసిపోయేవారట. 'నేను హీరో అయ్యాకే ఇంటికొచ్చి మీవాళ్లకు చెప్పి మన పెళ్లికి ఒప్పిస్తా' అనేవాడు. చివరికి అనుకున్నది సాధించి పెద్దవాళ్లను ఒప్పించాడు. గతేడాది నవంబరులో దంపతులయ్యారు.

karthikeya lohita reddy
కార్తికేయ- లోహిత రెడ్డి

ప్రేమ మధురం- పెళ్లి ఘనం

ఈ ఏడాది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన జంట కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌లు. రెండేళ్ల కిందట ‘కాఫీ విత్‌ ది కరణ్‌’ షోలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. విక్కీతో పోల్చుకుంటే కత్రినాది స్టార్‌ హోదా. కానీ అతగాడు చూపించే నిస్వార్థమైన ప్రేమ, అమితమైన శ్రద్ధ అతగాడికి పడిపోయేలా చేసిందని కత్రినా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కొన్నాళ్లదాకా ‘మేం స్నేహితులం మాత్రమే’ అని బుకాయించినా తర్వాత ఇష్క్‌ గురించి చెప్పక తప్పలేదు. మూడు నెలల కిందట రాజస్థాన్‌లోని ఓ ఏడు నక్షత్రాల హోటల్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందీ జంట.

vicky katrina
విక్కీ కౌశల్- కత్రినా కైఫ్

పదకొండేళ్ల ప్రేమాయణం

వరుణ్‌ ధావన్‌ తెరంగేట్రం చేయకముందే నటాషా దలాల్‌తో ప్రేమాయణం మొదలెట్టాడు. ఈ ప్రేమ వయసు పదేళ్లు. తను హీరోగా కెరీర్‌లో కుదురుకున్నాడు. నటాషా ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తోంది. ఎవరి వృత్తిలో వాళ్లు తీరిక లేకుండా ఉన్నా.. మనసులు చేరువగానే ఉండేవి. గుండెల నిండా ప్రేమ ఉన్నా.. ఏళ్లకేళ్లుగా ప్రేమించుకుంటున్నా వీళ్లిద్దరూ జంటగా కెమెరాలకు చిక్కింది లేదు. ఏడాది కిందట స్వయంగా గుట్టు విప్పేవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. చివరికి అతికొద్ది మంది అతిథుల సమక్షంలో గతేడాది మహారాష్ట్రలోని అలీబాగ్‌లో పెళ్లిపీటలెక్కారు.

varun natasha dhalal
వరుణ్ ధావన్- నటాషా దలాల్

తెర వీడి ఒక్కటయ్యారు

తను తెరపై మెరుస్తుంది. అతడు తెర వెనక ‘యాక్షన్‌’ చెబుతాడు. ‘యురి’ సమయంలో ఇద్దరికీ పరిచయం మొదలైంది. ఎన్నో ప్రేమకథలకు అక్షరరూపం ఇచ్చింది ఒకరైతే.. తెరపై ప్రేమికురాలిగా మెప్పించింది మరొకరు. చివరికి ఈ ఇద్దరూ ప్రేమలో పడితేగానీ దాని గొప్పతనమేంటో తెలియలేదట. ఒకట్రెండు తెలుగు సినిమాల్లో మెరిసిన యామీ గౌతమ్‌.. బాలీవుడ్‌ దర్శకుడు ఆదిత్య ధర్‌ల వలపు ముచ్చట ఇది. ఈ బంధంలో బందీ అయ్యాక ‘ప్యార్‌ మే పడిపోయామే...’ అని గట్టిగానే చెప్పారు. కొందరు అతిథుల సమక్షంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో పెళ్లి చేసుకొన్నారు.

yami gautham adithya dhar
యామీ గౌతమ్- ఆదిత్య ధర్

సహజీవనం సమాప్తం

పత్రలేఖా పాల్‌తో పదకొండేళ్ల డేటింగ్‌కు పెళ్లితో శుభం పలికాడు రాజ్‌కుమార్‌ రావు. థియేటర్‌ ఆర్ట్స్‌ నేర్చుకునే సమయంలో ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. తర్వాత ఇద్దరూ సహజీవనం చేసిన సంగతి ప్రపంచం అంతటికీ తెలుసు. ఈ ప్రేమాటను కట్టిపెట్టి ఈ మధ్యే సంప్రదాయబద్ధంగా పెళ్లిపీటలెక్కారు. ‘పదకొండేళ్ల తర్వాత నా ప్రియురాలు, ఆత్మీయురాలు, స్నేహితురాలు, నా సరదా, నా సర్వస్వాన్ని అధికారికంగా సొంతం చేసుకోబోతున్నాను. ఇప్పటి నుంచి పత్రలేఖ భర్త హోదా అందుకోబోతున్నాను’ అంటూ పెళ్లికి ముందు ట్వీట్‌ చేశాడు రాజ్‌కుమార్‌.

rajkumar rao patra lekha
రాజ్​కుమార్ రావు- పత్రలేఖ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.