ETV Bharat / sitara

గాయని నేహా కక్కర్: చిన్న గది నుంచి పెద్ద బంగ్లా వరకు - cinema news

బాలీవుడ్ గాయని నేహా కక్కర్.. తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. చిన్నతనంలో తను నివసించిన, ప్రస్తుతం కొన్న ఇంటి ఫొటోలను ఇన్​స్టాలో పంచుకుంది. నెటిజన్లు వీటికి తెగ కామెంట్లు పెడుతున్నారు.

గాయని నేహా కక్కర్: చిన్న గది నుంచి పెద్ద బంగ్లా వరకు
గాయని నేహా కక్కర్
author img

By

Published : Mar 7, 2020, 12:56 PM IST

తన అద్భుతమైన గొంతుతో గాయనిగా ఎంట్రీ ఇచ్చి, ఆపై 'ఇండియన్​ ఐడల్' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ పేరు తెచ్చుకుంది నేహా కక్కర్. సాధారణ సింగర్​గా జీవితం మొదలుపెట్టిన ఈమె.. ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ గాయనిగా కొనసాగుతుంది. అయితే ఇటీవలే కొత్తగా బంగ్లా కొన్న నేహా.. ఇన్​స్టాలో ఓ పోస్ట్ పెట్టి నెటిజన్ల మనసు గెల్చుకుంది.

ఇటీవలే రిషికేష్​లో కొత్త బంగ్లా కొనుగోలు చేసిన నేహా.. "నేను పుట్టినచోట .. రిషికేష్‌లో... ఇది ఇప్పుడు మా బంగ్లా.. గతంలో ఇక్కడే మా కుటుంబం ఒకే ఒక్క గదిలో ఉండేది. అందులోనే ఓ టేబుల్‌ విస్తీర్ణంలో మా 'కిచెన్‌' ఉండేది. అది మా సొంత గది కాదు. మేం అద్దె కట్టేవాళ్లం. ఇప్పుడు అదే ఊరులో నా సొంత బంగ్లాను చూస్తుంటే, ఉద్వేగం ఉప్పొంగుతోంది" అని రాసుకొచ్చింది. రెండు ఇళ్ల ముందు నిల్చుని ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

తను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది నేహా కక్కర్. అనంతరం ఈ పోస్ట్​పై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. "మీ కాళ్లపై మీరు నిలబడి, అందరికీ ఆదర్శంగా నిలిచారు" అని కామెంట్లు పెడుతున్నారు.

Neha Kakkar shares her inspiring journey
చిన్నతనంలో తను ఉన్న ఇంటి దగ్గర గాయని నేహా కక్కర్

ప్రస్తుతం ఉన్న ఇంటి దగ్గర గాయని నేహా కక్కర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.