నీట్ పరీక్ష భయంతో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తన మనసు కదిలించిందని తమిళ అగ్రహీరో సూర్య ట్వీట్ చేశారు. ఈ సంఘటన తనను చాలా బాధించిందని అన్నారు.
-
My heart goes out to the three families..! Can't imagine their pain..!! pic.twitter.com/weLEuMwdWL
— Suriya Sivakumar (@Suriya_offl) September 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My heart goes out to the three families..! Can't imagine their pain..!! pic.twitter.com/weLEuMwdWL
— Suriya Sivakumar (@Suriya_offl) September 13, 2020My heart goes out to the three families..! Can't imagine their pain..!! pic.twitter.com/weLEuMwdWL
— Suriya Sivakumar (@Suriya_offl) September 13, 2020
"విద్యార్థులు వారి విలువను నిరూపించుకోవడానికి ఈ పరీక్ష రాయాల్సి వస్తోంది. 'నీట్' వారి అవకాశాలను దూరం చేయడమే కాకుండా ప్రాణాలునూ తీస్తోంది. ఒక్క పరీక్షతో విద్యార్థి అర్హత, నైపుణ్యాలను లెక్కించడం సరైన పద్ధతి కాదు. నిన్న ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై మనం అప్రమత్తంగా లేకపోతే ఇదే పరిస్థితి మళ్లీ మళ్లీ జరుగుతుంది. డాక్టర్ కావాలన్న విద్యార్థుల కల చెదిరిపోయి సాధారణ కుటుంబాలకు చెందిన అమాయక విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మనమంతా మౌనం వీడాలి. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మన గళాన్ని వినిపించాలి"
- సూర్య శివకుమార్, కోలీవుడ్ నటుడు
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీర్పులను ప్రకటిస్తున్న న్యాయమూర్తులు.. విద్యార్థులను నేరుగా పరీక్ష రాయమని ఆదేశించడం ఏంటని సూర్య ప్రశ్నించారు. పరీక్ష కోసం అన్యాయంగా ఆత్మహత్యకు పాల్పడిన వారి తల్లిదండ్రులకు, ఇది జీవిత శిక్షగా మారుతుందని అన్నారు.