ETV Bharat / sitara

భారతి దంపతులకు బెయిల్​ రద్దుపై కోర్టుకు ఎన్​సీబీ - భారతి దంపతులకు బెయిల్

బాలీవుడ్​ హాస్యనటి భారతి దంపతులకు ఇచ్చిన బెయిల్​ను రద్దు చేయాలంటూ నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) ఓ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిద్దరికి కిందిస్థాయి కోర్టులో మంజూరు చేసిన బెయిల్​ను రద్దు చేసి.. జ్యుడీషియల్​ కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.

NCB seeks cancellation of Bharti Singh, husband's bail
భారతి దంపతుల బెయిల్​ రద్దుపై కోర్టుకు ఎన్​సీబీ
author img

By

Published : Dec 2, 2020, 5:35 AM IST

Updated : Dec 2, 2020, 9:47 AM IST

డ్రగ్స్​కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్యనటి భారతి దంపతులకు మెజిస్ట్రేట్​ ఇటీవలే బెయిల్​ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్​ రద్దు చేయాలంటూ నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ).. ఎన్​డీపీఎస్ ప్రత్యేక​ కోర్టును ఆశ్రయించింది. ఎన్​సీబీ అధికారులు నవంబరు 21న భారతి నివాసంలో చేసిన తనిఖీల్లో 86.5 గ్రాముల గంజాయి దొరకడం వల్ల ఈ భార్యభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. రూ.15 వేల పూచీకత్తుతో ఇటీవలే మేజిస్ట్రేట్ వీరిద్దరికీ బెయిల్​ మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో వీరి బెయిల్​ను రద్దు చేయాలంటూ ఎన్​డీపీఎస్ ప్రత్యేక న్యాయస్థానాన్ని.. ఎన్​సీబీ అధికారులు ఆశ్రయించారు. బెయిల్​ను రద్దు చేసి వారిద్దరిని జ్యుడీషియల్​ కస్టడీ కింద విచారించడానికి అనుమతించాలని అధికారులు కోరారు. విచారణలో భాగంగా భారతి దంపతులకు మంగళవారం.. ప్రత్యేక న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. దీనిపై వచ్చే వారం ఈ పిటిషన్​ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో చెలరేగిన మాదకద్రవ్యాల వినియోగం కేసు కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అగ్ర నటీనటులను ఎన్​సీబీ విచారించింది.

Last Updated : Dec 2, 2020, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.