ETV Bharat / sitara

ఆ బయోపిక్​లో నటించట్లేదు: నయనతార

తమిళనాడు రాణి బయోపిక్​లో తాను నటించట్లేదని నయనతార వెల్లడించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Nayanthara denies signing warrior queen's biopic
అవన్నీ పుకార్లే.. ఆ పాత్రలో నయన్​ నటించడం లేదు
author img

By

Published : Dec 30, 2020, 1:43 PM IST

తమిళనాడు రాణి వేలు నాచ్చియార్​ బయోపిక్​లో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను హీరోయిన్​ నయనతార ఖండించింది. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె బృందం ప్రకటన విడుదల చేసింది. అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. కథనాలు ప్రచురించే ముందు నిర్ధరణ చేసుకోవాలని పలు వెబ్​సైట్లకు లేఖలో సూచించింది.

18వ శతాబ్దానికి చెందిన వేలు నాచ్చియార్​.. ఈస్ట్​ఇండియా కంపెనీతో యుద్ధం చేసిన మొట్టమొదటి భారత రాణి. ఆమె బయోపిక్​లో నయన్​ నటిస్తున్నారని, ఈ మధ్య కాలంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే వాటిని నయన్ బృందం కొట్టిపారేసింది. ఈమె.. 'నేత్రికన్​', 'అన్నాత్త', 'కాత్తువక్కుల రెండు కాదల్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చూడండి: హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి త్వరలో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.