స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కొత్త విషయం ఏంటంటే బన్నీతో పాటు ఈ చిత్రంలో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు నవదీప్, సుశాంత్ నటించనున్నారని సమాచారం.
ఇతర పాత్రల్లో టబు, సత్యరాజ్ నటించనున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండనుంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరాకు విడుదలయ్యే అవకాశముంది.
త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.
ఇది చదవండి: హ్యాట్రిక్ కోసం 'త్రి'విక్రమ్‌తో అల్లు అర్జున్