కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్(vetrimaran upcoming movies).. టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 'అసురన్', 'ఆడుకలం', 'పొల్లధవన్' వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన.. ప్రముఖ కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్, వెంకటేష్ కోసం కథ సిద్ధం చేసినట్లు సమాచారం.
చెర్రీ-వెంకీ కాంబోలో మల్టీస్టారర్, ఎన్టీఆర్‌తో మరో సినిమా చేసే ప్రయత్నాల్లో వెట్రిమారన్ ఉన్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వీరితో చర్చలు కూడా జరిపారట! ఒకవేళ ఇదే నిజమైతే ఈ రెండింటిలో ఏ ప్రాజెక్టుతో ముందుకొస్తారో చూడాలి.
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'(RRR movie) చిత్రంతో బిజీగా ఉన్న రామ్‌చరణ్, తారక్(ram charan ntr film).. తమ తర్వాతి సినిమాలను శంకర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు. వెంకటేశ్.. 'ఎఫ్ 3'(Venkatesh F3 movie) సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదీ చదవండి:MAA Elections: మోహన్‌బాబుపై నాగబాబు ఫైర్