"ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది" అంటూ ప్రశ్నిస్తున్నారు కథానాయకుడు అల్లరి నరేష్. ఆయన కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకుడు. మంగళవారం నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ టీజర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
"ఈ ప్రపంచాన్ని టీజర్ రూపంలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. 'నాంది' చిత్ర బృందానికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. నరేష్ అన్న ఇందులో మీరు అద్భుతంగా ఉన్నారు" అని టీజర్‌ను పంచుకున్న సందర్భంగా విజయ్ దేవరకొండ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ లాయర్ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్ అనే పోలీస్ పాత్రలో హరిశ్ ఉత్తమన్, సంతోష్‌గా నటుడు ప్రవీణ్ కనిపించనున్నారు. లాక్‌డౌన్ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.