అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'నారప్ప'(Narappa) సినిమా కోసం సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న 'నారప్ప' చిత్రం.. ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బృందం.. 'నారప్ప'కు యూ/ఏ(U/A) సర్టిఫికేట్ ఇవ్వడం సహా చిత్రబృందాన్ని ప్రశంసించినట్లు సమాచారం.
-
#Narappa is 𝗖𝗲𝗻𝘀𝗼𝗿𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗨/𝗔. ✌️
— Suresh Productions (@SureshProdns) June 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
See you soon !! ✨@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @theVcreations pic.twitter.com/Kk7B95eAMg
">#Narappa is 𝗖𝗲𝗻𝘀𝗼𝗿𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗨/𝗔. ✌️
— Suresh Productions (@SureshProdns) June 29, 2021
See you soon !! ✨@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @theVcreations pic.twitter.com/Kk7B95eAMg#Narappa is 𝗖𝗲𝗻𝘀𝗼𝗿𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗨/𝗔. ✌️
— Suresh Productions (@SureshProdns) June 29, 2021
See you soon !! ✨@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @theVcreations pic.twitter.com/Kk7B95eAMg
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్రబృందం మొదట భావించినప్పటికీ కరోనా సెకండ్‌వేవ్ కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. లాక్‌డౌన్ అనంతరం పూర్తిస్థాయిలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకోనున్నాయనే విషయంలో స్పష్టత రాని కారణంగా 'నారప్ప' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించినట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌కు 'నారప్ప' టీమ్‌తో డీల్ కుదిరిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ వేదికగా 'నారప్ప'(Narappa on Amazon Prime) ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. జులై 24న ఈ సినిమా విడుదల కావొచ్చని అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా కోలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్‌హిట్ చిత్రం 'అసురన్'. ఈ సినిమాకు తెలుగు రీమేక్‌గా 'నారప్ప' సిద్ధమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేశ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా ప్రియమణి నటించారు. కుల వ్యవస్థ, భూ వివాదం.. వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా చిత్రీకరించారు.
ఇదీ చూడండి.. OTT movies: ఆ మూడు తెలుగు సినిమాలు ఓటీటీలో!