ETV Bharat / sitara

నాని, సుధీర్​ల 'వి' సినిమా విడుదల అప్పుడే? - latest v movie update

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వి'. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా వేసింది చిత్రబృందం. తాజాగా, క్రిస్మస్​ కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

nani v release
నాని
author img

By

Published : Aug 8, 2020, 5:31 AM IST

నేచురల్​ స్టార్​ నాని, సుధీర్​ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మల్టీస్టారర్​ 'వి'. చిత్రీకరణ పరంగా అన్ని పనులు పూర్తి చేసుకొని మార్చి 25న విడుదలకు సిద్ధమైన తరుణంలో కరోనా వచ్చి అడ్డుపడింది. దీంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్​ఫామ్​ వేదికగా విడుదల కానున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. అయితే, అలాంటి ఆలోచన లేదని చిత్ర నిర్మాతలు తెలిపారు. తాజాగా, మెల్లిమెల్లిగా థియేటర్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో క్రిస్మస్​ కానుకగా 'వి' చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో నాని సీరియల్​ కిల్లర్​గా విలన్​ పాత్రలో కనిపించనున్నాడు. నివేదా థామస్​, అతిదీ రావ్​ హైదరీ హీరోయిన్లు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. అమిత్​ త్రివేది స్వరాలు సమకూర్చగా.. దిల్​ రాజు నిర్మాణంలో తెరకెక్కింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.