నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్, కుటుంబ కథా చిత్రం 'టక్ జగదీష్'(Nani Tuck Jagadish). శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'నిన్నుకోరి' తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో నాజర్, జగపతిబాబు, నరేశ్, రావు రమేశ్, రోహిణి కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. ఏప్రిల్‌లోనే సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కొవిడ్ లాక్‌డౌన్ ముగిశాక థియేటర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఓటీటీకే మొగ్గుచూపారు నిర్మాతలు.
ఇదీ చూడండి: ఇంటిపేరు మార్చుకుంటున్న నాని ఫ్యాన్స్!