ETV Bharat / sitara

"టక్​ జగదీష్' కచ్చితంగా అలరిస్తుంది!' - నాని టక్​ జగదీశ్​ ట్రైలర్​

తెలుగు సినిమాకు ప్రాంతీయ కథల అవసరం ఎంతో ఉందని అన్నారు నేచురల్​ స్టార్​ నాని. ఆయన హీరోగా నటించిన 'టక్​ జగదీష్'​ చిత్ర ట్రైలర్​ను ఏప్రిల్​ 13న విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్​ను గురువారం విడుదల చేశారు.

tuck jagadish
టక్​ జగదీశ్​
author img

By

Published : Apr 1, 2021, 2:45 PM IST

తెలుగు సినిమాకు ప్రాంతీయ కథల అవసరం ఎంతో ఉందని నేచురల్ స్టార్ నాని అన్నారు. మన నేలపై పుట్టే కథలతో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం 'టక్ జగదీష్' ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న చిత్రబృందం.. ఈ నెల 13న విశాఖపట్నంలో ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన పోస్టర్​ను హైదరాబాద్​లో నాని లాంఛనంగా విడుదల చేశారు.

'టక్​ జగదీష్​' ప్రమోషన్​ ఈవెంట్​లో మాట్లాడుతున్న నాని

ఉగాది పండగతోపాటు 'టక్ జగదీష్' పండగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపుతుందన్నారు నాని. ఇంటిల్లిపాదిని అలరించేలా ఈ సినిమా ఉంటుందని చెప్పిన నాని.. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన రెండో చిత్రం 'టక్ జగదీశ్'.. ఆయన సరసన రీతూవర్మ కథానాయికగా నటించింది. జగపతిబాబు, రావు రమేశ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.

Nani Tuck Jagadeesh trailer poster released
'టక్​ జగదీష్​' ట్రైలర్​ రిలీజ్ పోస్టర్​

ఇది చూడండి: లైవ్ : హీరో నాని 'టక్ జగదీశ్' చిత్ర వేడుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.