Nani new movie: 'శ్యామ్‌సింగరాయ్'తో థియేటర్లలో సందడి చేస్తున్న నేచురల్ స్టార్ నాని.. కొత్త సినిమా అప్డేట్తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ కానుకగా 'అంటే సుందరానికీ' చిత్ర జీరో లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందులో నాని.. KPVSSPR సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
Valimai Official Trailer: హీరో అజిత్ కుమార్ నటించిన తమిళ సినిమా 'వాలిమై' ట్రైలర్ వచ్చేసింది. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా నటించగా, తెలుగు కథానాయకుడు కార్తికేయ.. విలన్‌గా కనిపించనున్నారు. హ్యుమా ఖురేషి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాకు 'ఖైదీ' ఫేమ్ వినోద్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి?
Dakko dakko meka song: 'పుష్ప' సినిమాలోని 'దాక్కో దాక్కో మేక' పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ అభిమానుల్ని అలరిస్తుంది. అడవిలో బన్నీ గెటప్, ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన దృశ్యాలు ఇందులో చూపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శేషాచలం బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
Jayamma panchayathi movie: ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా మేకింగ్ విడుదల చేసింది. చిత్రీకరణ సమయంలో 24 విభాగాలను సరదాగా ఏంటీ ఈ పంచాయితీ అంటూ సందడి చేస్తున్న దృశ్యాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' కొత్త ఎపిసోడ్.. శుక్రవారం రాత్రి 8 గంటలకు రిలీజ్ కానుందని ఆహా ఓటీటీ వెల్లడించింది. ఈ ఎపిసోడ్లో హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని సందడి చేయనున్నారు. 'విక్రమ్ వేదా' హిందీ రీమేక్ రెండో షెడ్యూల్ లక్నోలో పూర్తయింది. సైఫ్ అలీఖాన్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇందులో హృతిక్ రోషన్.. ప్రతినాయక లక్షణాలున్న పాత్ర పోషిస్తున్నారు. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి:
- OTT Release Movies: 'అఖండ', 'పుష్ప'.. ఓటీటీ విడుదల అప్పుడే!
- డిఫరెంట్ స్టోరీస్‌తో వచ్చారు.. హ్యాట్రిక్ హిట్ కొట్టారు!
- అల్లు అర్జున్ను న్యూడ్‌గా చూపించాలనుకున్నా: డైరెక్టర్ సుకుమార్
- ఇకపై రీమేక్‌లు అస్సలు చేయను: నాని
- 'శ్యామ్ సింగరాయ్' కోసం 15 గెటప్‌లు ట్రై చేశా: నాని
- సుమకు అన్ని భాషల్లో నటించగల సత్తా ఉంది: రానా