నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అక్షర'. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని చిన్నికృష్ణ తెరకెక్కించారు. ఫిబ్రవరి 26న విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. సత్య, మధునందన్, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. సురేశ్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఒక కార్పొరేట్ కళాశాలలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కేసును ఛేదించే పోలీసులు.. మరోవైపు విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెప్పే టీచర్‌గా హీరోయిన్.. ఇంకోవైపు కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలు.. ఈ కథాంశంతో సినిమా కథ సాగనుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంతో పాటు ఒక మంచి సామాజిక సందేశం కూడా ఇస్తుందని దర్శక-నిర్మాతలు గతంలోనే చెప్పారు. 'భూమిని నమ్ముకున్నోడు రైతు.. చదువును నమ్ముకున్నోడు రాజు' అంటూ సాగే మంచి డైలాగ్స్‌తో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మీరూ చూసేయండి.
'గాలి సంపత్'లోని తొలి పాట
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, యువ నటుడు శ్రీవిష్ణులను గిఫ్టెడ్ యాక్టర్స్‌గా అభివర్ణించారు నేచురల్ స్టార్ నాని. వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషించిన 'గాలి సంపత్' సినిమాలోని తొలి పాటను నాని మంగళవారం విడుదల చేశారు. 'ఫిఫిఫీ ఫిఫీఫీ' అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: భయపెడుతున్న జాన్వీ- 'షాదీ ముబారక్' టీజర్ రిలీజ్