సహాయనటుడిగా, హీరోగా రాణిస్తున్న నటుడు నందు. ప్రస్తుతం రాజ్ విరాట్ దర్శకత్వంలో 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా చేస్తున్నారు. శుక్రవారం అతడి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. రష్మీ గౌతమ్ హీరోయిన్గా కనిపించనుంది.
ఇందులో పోతురాజు పాత్రలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు వీరాభిమానిగా నందు నటిస్తున్నారు. పోస్టర్లో చాలా మాస్‌గా కనిపిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![nandhu first look from bomma blockbuster movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8662584_nandhu.jpg)