గణేశ్ చతుర్ధిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. హాస్పిటల్ ఆవరణలోని ఆలయంలో గణపతి విగ్రహాన్ని ఆరాధించారు. నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్దలతో జరపాలని పూజారిని కోరారు. మండపంలో కొలువైన బొజ్జ గణపయ్యకు రకరకాల నైవేద్యాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి కూడా తన నివాసంలో ప్రత్యేకంగా గణపతి పూజించారు. ఆయన పుట్టినరోజుతోపాటు చవితి వేడుకలు ఒకేసారి రావడం వల్ల ఇంటిల్లిపాది ఆనందంగా లంబోదరుడిని ఆరాధించారు.
వీరితో పాటే హీరోయిన్ సమంత, యువ హీరో నాగశౌర్య, కథానాయిక నిధి అగర్వాల్‌లు తమ తమ నివాసాల్లో గణేశ్ చవితి వేడుకలు నిర్వహించారు. ప్రజల ఎదుర్కొంటున్న విఘ్నాలన్నింటిని తొలగించాలని గణనాథున్ని ప్రార్థించారు.