నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి ఓ చిత్రం చేస్తున్నారు. తాత్కాలికంగా 'బీబీ3' అని పిలుచుకునే ఈ చిత్రానికి 'డేంజర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. గతంలో ఈ సినిమాకు 'మోనార్క్' అనే పేరు కూడా వినిపించింది. బాలకృష్ణ - బోయపాటిల చిత్రాల టైటిల్స్ శక్తివంతంగా, గంభీరంగా ఉంటాయి. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లెజెండ్', 'సింహా' చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ నయా చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. రైతన్నల సమస్యల నేపథ్యంతోనే కథ ఉంటుందని సమాచారం. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో అఘోరాగా దర్శనమివ్వనున్నట్లు సమాచారం.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌లో షూటింగ్‌ని ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది. తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'బీబీ3' ఫస్ట్ రోర్ చిత్రంపై అంచనాలు పెంచుతోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని భావిస్తోందట చిత్రయూనిట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">