బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ ప్రత్యేకమైనది. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో సినిమాకు రంగం సిద్ధమైంది. 'సింహా', 'లెజెండ్'.. సినిమాల్లో బాలకృష్ణ రెండో కోణం ప్రేక్షకుల్ని అలరించింది. ఆ పాత్రల్లోని బలం, భావోద్వేగాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. మూడో సినిమాలోనూ బాలకృష్ణ రెండో అవతారమే శక్తిమంతంగా నిలవనుంది. ఆ విషయంపై దర్శకుడు బోయపాటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పాత్రని తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ పాత్రకు సంబంధించిన ఓ ఫొటో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. నల్ల మీసం, తెల్ల గడ్డంతో బాలయ్య ఓ అభిమాని ఇంట్లో కనువిందు చేశారు. ఇదే రెండో పాత్ర లుక్ అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్నారు. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింది. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులో కానీ, సెప్టెంబరులో కానీ పునః ప్రారంభించే అవకాశాలున్నాయి.