ETV Bharat / sitara

'గరుడవేగ' దర్శకుడితో నాగ్ యాక్షన్ ఎంటర్​టైనర్

author img

By

Published : Jul 27, 2020, 9:43 PM IST

విభిన్న కథలు ఎంచుకోవడంలో అక్కినేని హీరో నాగార్జున ముందుంటారు. తాజాగా నాగ్​ ఓ యాక్షన్ ఎంటర్​టైనర్ చేసేందుకు సిద్ధమయ్యారు. 'గరుడవేగ'తో విజయాన్నందుకున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు.

'గరుడవేగ' దర్శకుడితో నాగ్ యాక్షన్ ఎంటర్​టైనర్
'గరుడవేగ' దర్శకుడితో నాగ్ యాక్షన్ ఎంటర్​టైనర్

అగ్ర కథానాయకుడు నాగార్జున ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ, కొత్తదనాన్ని ప్రోత్సహించే ఆయన మరోసారి ఆ బాటే పట్టారు. 'గరుడవేగ'తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో నాగార్జున నటించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఏషియన్ గ్రూప్ ఛైర్మన్‌ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నాగార్జున-ప్రవీణ్‌ సత్తారుల సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌' చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. అది పూర్తయిన వెంటనే ప్రవీణ్‌ సత్తారు సినిమా కోసం నాగ్‌ రంగంలోకి దిగుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.