ETV Bharat / sitara

'నేను స్టార్​గా ఎదగడానికి కారణమదే!' - నాగార్జున దియా మీర్జా

కొత్త దర్శకులను నమ్మి అవకాశం ఇవ్వడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'వైల్డ్​ డాగ్​' ఏప్రిల్​ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నాగ్​ మీడియాతో పంచుకున్నారు.

Nagarjuna Wild Dog movie interview
నేను స్టార్​గా ఎదగడానికి కారణమదే: నాగార్జున
author img

By

Published : Apr 1, 2021, 5:32 AM IST

"నా కెరీర్‌లో 'వైల్డ్‌ డాగ్‌' చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది" అని అన్నారు ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున. అహిషోర్‌ సాల్మన్‌ తెరకెక్కించిన చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా నాయికలు. ఏప్రిల్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడారు నాగార్జున. ఆ విశేషాలివీ..

Nagarjuna Wild Dog movie interview
నాగార్జున

త్వరగా పూర్తవుతుందని..

2019లో 'బంగార్రాజు' చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నా. అదే సమయంలో 'వైల్డ్‌ డాగ్‌' స్ర్కిప్టు తీసుకొచ్చారు సాల్మన్‌. ఇది అయితే త్వరగా చిత్రీకరణ పూర్తి చేయొచ్చని భావించి ప్రారంభించాను. లాక్‌డౌన్‌కి ముందే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి మిగిలిన చిత్రీకరణ పూర్తిచేశాం.

ఆ నమ్మకం ఉంది..

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథ ఇది. వేగవంతమైన స్క్రీన్‌ప్లే కొత్త అనుభూతి పంచుతుంది. ఈ చిత్రంలో ఎన్‌.ఐ.ఎ టీమ్‌ లీడర్‌గా విజయ్‌ వర్మ అనే పాత్రలో కనిపిస్తాను. తండ్రి, భర్త, స్నేహితుడు ఇలా అన్ని బంధాలు అల్లుకున్న పాత్ర ఇది. వ్యక్తిగతంగా నాకు ఈ పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ పాత్ర కోసం నేను ఏ అధికారిని కలవలేదు. కానీ, దర్శకుడు సాల్మన్‌ కథకు సంబంధించి రీసెర్చ్‌లో భాగంగా సర్జికల్‌ స్ట్రైక్‌‌లో పాల్గొన్న ఓ ఆర్మీ మేజర్‌ను కలిశారు. ఆయన సెట్‌కి వచ్చి కొన్ని మెలకువలు నేర్పించారు. ఇది నా కెరీర్‌లో చెప్పుకునే ప్రత్యేకపాత్ర అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.

ట్రైలర్‌ చూసి నిర్ణయానికొస్తున్నారు..

Nagarjuna Wild Dog movie interview
నాగార్జున

ఈ చిత్రానికి సంబంధించి ప్రచారంపైనా ఎక్కువ శ్రద్ధ పెట్టాను. నేను తప్ప అందరూ కొత్త వాళ్లే. దర్శకుడితో సహా. కాబట్టి ఇలాంటి కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే అదనంగా ప్రమోట్‌ చేయాల్సిందే. ఆ ఆలోచనతోనే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రానికి కాస్త విరామం ఇచ్చి ప్రచారంలో పాల్గొంటున్నాను. సినిమా తెరకెక్కించేందుకు ఎంత జాగ్రత్త తీసుకున్నామో ట్రైలర్‌ కోసం అంతే జాగ్రత్త తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్‌ చూసే సినిమా కోసం థియేటర్‌కి వెళ్లాలా, వద్దా? అనుకుంటున్నారు ప్రేక్షకులు. వాళ్లను మెప్పించే ప్రయత్నంలో భాగంగా ఆరేడు సార్లు ట్రైలర్‌ను కట్‌ చేశాం. ఈ సినిమాలో కొత్తగా ఏం ఉండబోతుందో? అది ట్రైలర్‌లో చూపించాం.

దాన్ని ఇష్టపడను..

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాల్లో రెగ్యులర్‌ యాక్షన్‌ సన్నివేశాలు పెట్టేందుకు వీలుండదు. అవి లేకపోతే సినిమా అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని యాక్షన్‌ సీన్లను బ్యాలెన్స్‌ చేశాం. నన్ను నేను ఒకే రకమైన పాత్రల్లో చూసుకోవడానికి ఇష్టపడను. కొత్త కథలు వచ్చినపుడు పాత్రలూ కొత్తగా ఉంటాయి. అది నూతన దర్శకులైతేనే చేయగలరు. అందుకే వాళ్లకు ఎక్కువగా అవకాశం ఇస్తుంటాను. నేను ఇంతటి స్టార్‌ అవడానికి కారణం అదే. ఈ ప్రయత్నంలో పరాజయాలు ఎదురైనా పట్టించుకోను.

'శివ' విషయంలోనూ ఇలానే అన్నారు..

నేను ఫిట్‌నెస్‌ను ఇష్టపడతాను. అందుకే ఈ వయసులోనూ యాక్షన్‌ చిత్రం చేశాను. పూర్తి స్థాయి యాక్షన్‌ నేపథ్యం కావడం వల్ల కుటుంబ ప్రేక్షకులు రారేమో అనే సందిగ్థత ఉంటుంది. 'శివ' చిత్రానికి ఇలానే అన్నారు. అయినా ఆడవాళ్లు కోరుకునేది ఇలాంటి పవర్‌ఫుల్‌ మగవాళ్లనే కదా (నవ్వుతూ..). ప్రస్తుతానికి ఈ కథను తెలుగులో తెరకెక్కిస్తే చాలు అనుకున్నాం. త్వరలోనే హిందీలో డబ్‌ అవుతుంది. ప్రేక్షకులు ఓటీటీ వల్ల అన్ని రకాలుగా ఎక్స్‌పోజ్‌ అయ్యారు. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి న్యూ ఏజ్‌ కమర్షియల్‌ చిత్రాలకు ఓ విధంగా ప్లస్‌ అవుతుంది.

Nagarjuna Wild Dog movie interview
నాగార్జున

తదుపరి చిత్రాలు..

అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌ తరుణ్‌తో ఓ చిత్రం నిర్మిస్తున్నాను. వైష్ణవ్‌ తేజ్‌తో ఓ సినిమా రూపొందించబోతున్నాను. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా. నా విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం జులైలో పూర్తయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత 'బంగార్రాజు' మొదలుపెడతాను. హిందీ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో మంచి పాత్ర పోషిస్తున్నాను‌. అఖిల్‌తో కలిసి పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ఒకటి చేయాలని ఉంది.

ఇదీ చూడండి: "వైల్డ్​ డాగ్'​ రిలీజ్​ తర్వాత మరిన్ని ఛాన్సులొస్తాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.