కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు-2' ట్రైలర్ను విడుదల చేశారు. నాగ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన 'మన్మథుడు'కు ఇది సీక్వెల్. ఈ సందర్భంగా చిత్ర విశేషాల్ని పంచుకున్నాడు అక్కినేని కథానాయకుడు.
"ఈ చిత్రం ఓ ఆంగ్ల చిత్రానికి కాపీ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలా అని సొంత కథ కూడా కాదు. ఓ ఫ్రెంచ్ కామెడీ సినిమా ఆధారంగా రూపొందించాం. ఏడాదిన్నర క్రితం ఆ చిత్రం చూశా. నాకు బాగా నచ్చడం వల్ల రీమేక్ హక్కులు కొనుగోలు చేశాం. ఆ తర్వాత ఈ కథను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేతుల్లో పెట్టాం. రీమేక్ అయినప్పటికీ.. మాతృకతో పోలిక ఉండదు. కేవలం కథలోని ఆత్మను మాత్రమే తీసుకోని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చాం. దీని కోసం రాహుల్‌కు ఏడాదికి పైగా సమయం పట్టింది" -నాగార్జున, కథానాయకుడు.
ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. వెన్నెల కిశోర్, రావు రమేశ్ తదితరులు సహాయ పాత్రలు పోషించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన్మథుడు 2’ను ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్ హిట్ సినిమా ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: ఎక్కడో కొడుతంది చిన్నా... 'మన్మథుడు' ట్రైలర్