ETV Bharat / sitara

ఎయిట్​​ప్యాక్​ కోసం ఐదురోజుల పాటు నాగశౌర్య అలా! - nagashourya eight pack body

కొత్త సినిమా కోసం ఎయిట్​ ప్యాక్​ సాధించే క్రమంలో కొన్ని రోజుల పాటు నీళ్లు తాగకుండా ఉన్నారట నాగశౌర్య. ఇటీవలే వచ్చిన ఫస్ట్​లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

Naga Shaurya
నాగశౌర్య
author img

By

Published : Sep 20, 2020, 8:58 PM IST

సినిమాల్లో పాత్రకు తగ్గట్లు తమ దేహాన్ని మార్చుకునేందుకు హీరోలు భారీ కసరత్తులు చేస్తుంటారు. అందుకుతగ్గట్లుగానే డైట్ పాటిస్తుంటారు. యువకథానాయకుడు నాగశౌర్య కూడా ఇలానే కొత్త సినిమా కోసం ఎయిట్​ప్యాక్​ సాధించారు. ఇందుకోసం లాక్‌డౌన్​లో క‌చ్చిత‌మైన డైట్ పాటిస్తూ, రోజూ జిమ్‌లో చెమ‌టలు చిందించారు. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకొచ్చింది.

తన శరీరాన్ని సరైన ఆకారంలోకి తీసుకొచ్చే క్రమంలో దాదాపు ఐదు రోజులపాటు నీళ్లు తాగలేదట. కనీసం లాలాజలాన్ని కూడా మింగలేదని చెప్పినట్లు తెలుస్తోంది.

నాగశౌర్యకు ఇది 20వ సినిమా. 'సుబ్రహ్మణ్యపురం' దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్చర్​గా క‌నిపించ‌నున్నారు నాగశౌర్య. ఇటీవలే ఫస్ట్​లుక్​ను విడుదల చేయగా, అభిమానుల నుంచి ఆదరణ దక్కించుకుంది.

ఇదీ చూడండి బుల్లితెరపై మరో సర్​ప్రైజ్​కు రానా రెడీ.. ఈ సారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.