ఇటీవలే 'ఓ బేబీ' చిత్రంతో విజయం అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య జోరు పెంచాడు. ఓ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. 'సుబ్రహ్మణ్యపురం' ఫేం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. సోమవారం ఆ సినిమా లాంఛనంగా మొదలైంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా మరో నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్‌స్టార్‌ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నారాయణదాస్ నారంగ్, శరత్‌మరార్, రామ్ మోహన్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తొలి సన్నివేశాన్ని పూజా కార్యక్రమంపై చిత్రీకరించారు. క్రీడానేపథ్యంలో తెరకెక్కనుందీ సినిమా. టైటిల్, కథానాయిక, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇవీ చూడండి.. ఫొటో వైరల్: రణ్వీర్ ఏంటా చూపు..!