టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga chaitanya) భార్య సమంత (Samantha) తో విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా కనిపించలేదు. 45 రోజుల విరామం తరువాత.. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిపోస్ట్ చేశాడు. అమెరికన్ హాలీవుడ్ నటుడు మాథ్యూ మాక్కనౌగే రచించిన ‘గ్రీన్ లైట్స్’ (Green Lights) అనే ఆటోబయోగ్రాఫ్రి చదివిన చైతూ.. "జీవితానికి ప్రేమ లేఖ.. గ్రీన్‌లైట్స్" అని అభివర్ణించాడు. రచయిత మాథ్యూని ట్యాగ్ చేస్తూ.. "మీ ఆత్మకథని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు నాకు ఈ పుస్తకం ఉపయోగపడింది. ఇలాంటి పుస్తకం రచించినందుకు మీకు గౌరవవందనాలు సర్!" అంటూ కొనియాడాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగా ఉంచేందుకు ఇష్టపడే చైతూ.. సోషల్‌మీడియాలో పోస్టింగ్స్ చేయడం ఇష్టం ఉండదని గతంలో సమంత నిర్వహించిన సామ్- జామ్ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్ కార్లు, బైక్ రైడింగ్‌ని అమితంగా ఇష్టపడే చై.. తొలిసారి జీవితానికి సంబంధించిన పుస్తకం గురించి చర్చించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బంగ్రార్రాజు, థాంక్యూ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ యువ హీరో త్వరలోనే ఓటీటీల్లోనూ అడుగుపెట్టనున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హారర్ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పేశారు.
అలా విడిపోయారు..
అక్టోబర్ 2వ తేదీన తాము విడిపోవటంపై సమంత(Samantha latest news), నాగచైతన్య ఏకకాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. "మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఇరువురూ పోస్ట్ చేశారు.
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. ముచ్చటైన జంట విడిపోయిందంటూ అభిమానులు బాధపడ్డారు. నాగచైతన్య-సమంత(samantha and naga chaitanya) విడిపోవటం బాధాకరమని అగ్ర కథానాయకుడు నాగార్జున విచారం వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, ఇద్దరూ తనకెంతో దగ్గరి వారని నాగార్జున అన్నారు. వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 'మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి' అంటూ వెంకటేశ్(venkatesh daggubati movies) పెట్టిన పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇవీ చూడండి:
అభిమానుల ఆవేదన- సామ్ అంత పనిచేసిందా?