టాలీవుడ్ హీరో నాగచైతన్య.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. శనివారం ఈ కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ను విడుదల చేసింది చిత్రబృందం. ద వరల్డ్ ఆఫ్ #ఎన్సీ19 పేరుతో ఓ వీడియోను పంచుకుంది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రానుందీ చిత్రం.
నాగచైతన్య.. 'వెంకీమామ'లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో విక్టరీ వెంకటేశ్ మరో హీరోగా కనిపించనున్నాడు. పాయల్ రాజ్పుత్, రాశీఖన్నా హీరోయిన్లు. బాబీ దర్శకుడు.
ఇది చదవండి: నాగచైతన్య 'మజిలీ'లో ఎన్నో మలుపులు