ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం చేసిన సందడి అంతా ఇంతా కాదు. చిత్రబృందంతో కలిసి షాంపైన్ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ చిత్రంలో నటనతో ఆకట్టుకున్న నభా నటేశ్ను హీరోయిన్ ఇలియానాతో పోల్చుతూ ఆమెతో ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దర్శకుడు పూరీ జగన్నాథ్ గతంలో తెరకెక్కించిన 'పోకిరి'లో హీరోయిన్గా ఇలియానా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమాలో ఊరమాస్ పాత్రలో అలరించాడు హీరో రామ్. హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేశ్ తమ అందచందాలతో ప్రేక్షకుల్ని మైమరపించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.
ఇది చదవండి: మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!