ETV Bharat / sitara

'అర్జున్ రెడ్డి' కాంబో మరోసారి.. నెట్టింట జోరుగా చర్చ! - సందీప్ రెడ్డి వంగతో మైత్రీ మూవీ మేకర్స్

టాలీవుడ్​లో బ్లాక్​బస్టర్​గా నిలిచిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. కాగా, ఈ కాంబో మరోసారి అలరించడానికి సిద్ధమైందట.

Mythri Movie Makers planning a movie with Arjun Reddy director
'అర్జున్ రెడ్డి' కాంబో మరోసారి.
author img

By

Published : Feb 9, 2021, 2:08 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలకు స్టార్​ హోదా తీసుకొచ్చిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమా బ్లాక్​బస్టర్​గా నిలిచి వీరికి వరుస ఆఫర్లను తెచ్చిపెట్టింది. హిందీలో ఈ మూవీని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడా ఘనవిజయం అందుకున్నాడు సందీప్. కాగా, ఈ కాంబినేషన్​ మరోసారి అలరించేందుకు సిద్ధమైందని టాలీవుడ్ వర్గాల టాక్. వీరితో ఓ సినిమా చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నిస్తుందట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే చిత్రం చేస్తున్నాడు. అలాగే సందీప్ బాలీవుడ్​ హీరో రణ్​బీర్ కపూర్​తో కలిసి 'ఎనిమల్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.