ETV Bharat / sitara

అందుకే నేను లావుగా ఉన్నా: విద్యాబాలన్​

తాను అధిక బరువు ఉండటంపై వస్తున్న వార్తలపై స్పందించిన బాలీవుడ్​ నటి విద్యాబాలన్.. ఎందుకు లావుగా ఉన్నాననే కారణాన్ని తెలిపారు. ఈ లావు శరీరం వల్ల ఎన్నోసార్లు అసహనానికి గురైనట్లు వెల్లడించారు. అప్పట్లో కష్ట సమయాల్లో ధైర్యం చెప్పేవాళ్లు కూడా లేకపోయారని భావోద్వేగం చెందారు.

vidya balan
విద్యాబాలన్​
author img

By

Published : Mar 11, 2021, 7:25 AM IST

సినిమాయేతర కుటుంబం నుంచి వచ్చిన దాన్ని కావడం వల్ల తనకు కష్ట సమయాల్లో ధైర్యం చెప్పేవాళ్లు లేకపోయారని బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ అన్నారు. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. 'డర్టీ పిక్చర్‌', 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరవయ్యారు.

ఇటీవల తన అధిక బరువుపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. తన అధిక బరువుకు గల కారణాలు వెల్లడిస్తూనే.. లావుగా ఉన్నా సరే తన శరీరానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"ఎప్పటి నుంచో నాలో హార్మోన్ల సమస్య ఉంది. అందువల్ల నేను చాలాకాలంగా లావుగా ఉన్నా. అలా ఉండటం నన్ను బాధపెట్టే విషయమే. తొలినాళ్లలో కొన్నిసార్లు నేను అసహనానికి గురవ్వడం సహా విపరీతంగా చిరాకుపడేదాన్ని. నేను సినిమాయేతర కుటుంబం నుంచి వచ్చా. అందుకే.. అధిక బరువు వల్ల మన కెరీర్‌ ముగిసిపోదని ధైర్యం చెప్పేవాళ్లు లేకపోయారు. ఆ తర్వాత నా అంతట నేనే.. నన్ను నేను ఆస్వాదిస్తూ.. నా శరీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టా. ఎందుకంటే నేను బతికి ఉండటానికి కారణం ఈ శరీరమే. నా శరీరానికి చాలా కృతజ్ఞతలు" అని ఆమె పేర్కొంది.

ముంబయికి చెందిన విద్యాబాలన్‌కు కెరీర్‌ ఆరంభంలో ఎన్నో తిరస్కారాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2004లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా ఆమెను వరించింది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ వస్తున్న ఆమె.. ప్రస్తుతం 'షెర్నీ' అనే సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి: విద్యాబాలన్​ 'నట్​ఖట్'​కు అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.