ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అంటోంది కథానాయిక రాశీ ఖన్నా. ఆశావాహ దృక్పథంతో అడుగేయడమే నా బలం అని చెబుతోందామె. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న రాశీ.. ఇటీవల తరచూ ఫొటో షూట్‌లతో సందడి చేస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ తెరపైనా, బయట ఎంత ఆర్భాటంగా కనిపించినా.. ఇంట్లో మాత్రం చాలా సాధారణంగా గడుపుతుందట రాశి.
"కెమెరా ముందు ఉన్నప్పుడే నేను నటిని. ఇంట్లో మాత్రం నేను నా చుట్టూ వాతావరణం చాలా సాధారణంగా ఉంటుంది. నా అవసరాలు కూడా అలాగే ఉంటాయి. చదువుతూనో లేదంటే నాతో నేను గడుపుతూ నిశ్శబ్దంగానో ఉంటాను. ఆధ్యాత్మిక ప్రభావమేమో తెలియదు కానీ... కెరీర్‌లో ఒడుదొడుకుల గురించి కూడా కలవరం చెందను. ఉత్తమమైనది ఇంకా ముందు ఉందనే ఒక నమ్మకం నన్నెప్పుడూ వదిలిపెట్టదు" అని చెప్పింది రాశి.
ఇదీ చూడండి: 'ఒడిశా అమ్మాయికి లవ్లెటర్స్ రాశా'