ETV Bharat / sitara

'ఒడిశా అమ్మాయికి లవ్​లెటర్స్​ రాశా' - వివాహ భోజనంబు

టాలీవుడ్​ యంగ్​ హీరో సందీప్​ కిషన్​.. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీబిజీగా గడుపుతున్నారు​. ఆయన నటిస్తున్న 'ఏ1 ఎక్స్​ప్రెస్​', నిర్మించిన 'వివాహ భోజనంబు' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను సందీప్​ కిషన్​ వెల్లడించారు.

My first love was a Vizag girl, Says Sundeep Kishan
'ఒరిస్సా అమ్మాయికి లవ్​లెటర్స్​ రాశా'
author img

By

Published : Dec 21, 2020, 7:37 AM IST

వైవిధ్యభరిత కథలతో సినీప్రియులకు వినోదాలు పంచివ్వడంలో ఎప్పుడూ ముందుంటారు యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌. 'నిను వీడని నీడను నేనే' చిత్రంతో నటుడిగానే కాక మంచి అభిరుచి గల నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ జోష్‌లోనే నటుడిగా, నిర్మాతగా వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారాయన. ప్రస్తుతం 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌', 'వివాహభోజనంబు'తో పాటు రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు సందీప్‌. ఈ సందర్భంగా సినీ, వ్యక్తిగత విశేషాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

లాక్‌డౌన్‌లో నేను నా శరీరంపై దృష్టి పెట్టడం తప్ప, మిగతా ఏమీ ఆలోచించలేదు. 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' కోసం ఏడాదిపాటు కష్టపడి సన్నద్ధమయ్యా. అందులో భాగంగా సిక్స్‌ప్యాక్‌ కూడా చేశా. అంతలోనే కరోనా కలకలం మొదలైంది. లాక్‌డౌన్‌ సమయంలో పెంచిన ఆ దేహాన్ని కాపాడుకోవడం కోసం కసరత్తులు చేస్తూ గడిపా. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. మా అమ్మానాన్నలు పెళ్లెప్పుడు అని అడిగిందే లేదు. నేనే సరదాగా మా చెల్లికి ఫోన్‌ చేసి 'మీ అన్నయ్య పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏమిటి?' అని అడిగా. 'నీకు అప్పుడే పెళ్లేమిటి?' అంది తను. పెళ్లి సమయం వస్తే అదే జరుగుతుంది.

లాక్‌డౌన్‌ పూర్తవగానే సెట్స్‌పైకి వెళ్లినట్టున్నారు. సెట్స్‌లో అప్పుడెలాంటి పరిస్థితులున్నాయి?

అందరిలోనూ భయాలు ఉన్నాయి. కానీ, ఎన్నాళ్లు అలా కూర్చుంటాం. మేం మా 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'ను పునఃప్రారంభించిన తొలిరోజే సెట్లో కరోనా కలకలం మొదలైంది. టెస్ట్‌లు అన్ని పూర్తి చేసి.. అది కొవిడ్‌ కాదని నిర్ధారించుకున్నాక మళ్లీ షూట్‌ మొదలుపెట్టాం. 'వివాహ భోజనంబు' మొదలు పెట్టిన 14రోజులకు మా దర్శకుడికి, సహ నిర్మాతలకు కరోనా సోకింది. దీంతో 21రోజుల పాటు చిత్రీకరణ ఆపాల్సి వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద సవాల్‌గా నిలిచింది. ఎందుకంటే ఆ సినిమా సెట్లో రోజూ 16మంది నటులుంటారు. ఒకేసారి అన్ని రోజులు చిత్రీకరణ ఆగిపోయేసరికి.. మళ్లీ అందరి డేట్లు సెట్‌ చేసుకోవడం కోసం చాలా కష్టపడ్డాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా 35రోజుల్లోనే ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం. అందుకే నాకు ఆ సినిమా ఎంతో ప్రత్యేకం.

మీ జీవితంలో ప్రేమకథలేమీ లేవా మరి?

అందరి జీవితాల్లో ఉన్నట్లే.. చదువుకునే రోజుల్లో చిన్న చిన్న ప్రేమకథలు ఉన్నాయి. ప్రత్యేకంగా గుర్తుండిపోయింది మాత్రం స్కూల్‌ రోజుల్లోని ప్రేమే. విశాఖలోని నేను చదువుకున్న స్కూల్‌లో ఒడిస్సా అమ్మాయి ఉండేది. చాలా బాగుంటుంది. తనని బాగా ఇష్టపడ్డా. అదే స్కూల్‌లో నాకొక నేపాలీ స్నేహితుడు ఉండేవాడు. ప్రేమలేఖ రాసి నేను వాడికిస్తే, అది వాడు తన చెల్లి ద్వారా నేను ఇష్టపడిన అమ్మాయికి చేర్చేవాడు. అలాంటి కథలు ఇంకొన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తలచుకుంటే చాలా నవ్వొస్తుంటుంది. సినిమాల్లోకి వచ్చాక తెరపైన ప్రేమకథల్లో నటించడం తప్ప, నిజ జీవితంలో ప్రేమించేంత తీరిక దొరకలేదు.

'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' కోసం చాలా కష్టపడినట్లున్నారు?

ఈ చిత్రం కోసం దాదాపు ఆరు నెలలు హాకీలో శిక్షణ తీసుకున్నా. 16కిలోలు బరువు తగ్గా. సిక్స్‌ప్యాక్‌ చేశా. నేనిప్పటి వరకు ఏ చిత్రం కోసం పడని కష్టమంతా దీనికోసం పడ్డా. ఎందుకంటే తెలుగులో హాకీ నేపథ్యంతో తెరకెక్కిన తొలి చిత్రమిది. చాలా అరుదుగా దొరికే కథ. అందుకే ఈ చిత్రం కోసం ఎంత కష్టపడినా తక్కువే అనిపించింది. చాలాసార్లు మోనిటర్‌లో సినిమా చూసుకుంటున్నప్పుడు ఇది నా చిత్రమేనా అనిపించేది. నిజానికి మార్చిలోనే ఈ చిత్రం పూర్తి కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ వల్ల ఆలస్యమైంది.

ఈ సినిమా కోసం స్టేడియంలోకి వెళ్లినప్పుడు, ఒక ఆటగాడిలా మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు మీ మనసులో కలిగిన భావాలేమిటి?

నేను తొలిసారి స్టేడియంలో చూసిన ఆట హాకీనే. చిన్నప్పుడు అమ్మతో కలిసి నెదర్లాండ్స్‌ - భారత్‌ హాకీ ఫైనల్‌ మ్యాచ్‌ చూడటానికి వెళ్లా. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ చిత్రం కోసం స్టేడియంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ మళ్లీ గుర్తొచ్చాయి. నిజమైన ప్లేయర్‌లా జెర్సీ వేసుకోని, హాకీ స్టిక్‌ పట్టుకుని వందల మంది మధ్య ఆట ఆడుతూ ఉద్వేగానికి లోనయ్యా. ఈ పాత్ర చేశాక నాలో ఓ తెలియని స్ఫూర్తి రగిలింది.

బయోపిక్స్‌లో నటించాలనే ఆలోచనలేమైనా ఉన్నాయా?

నాకు భగత్‌ సింగ్‌, చెగువేరా అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే వాళ్ల జీవితకథల్లో నటించాలని ఉంది. నిజానికి బయోపిక్స్‌ ఎవరికి పడితే వాళ్లకు సెట్‌ అవ్వవు. ఆ పాత్ర చేసే నటుడు దానికి సరిపడేలా ఉండాలి. తను చేస్తే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరుతుంది అనిపించాలి. ఇవన్నీ సాధ్యమవ్వాలంటే ముందు కథ కుదరాలి. గతంలో నాకిలాంటి కథ చేసే అవకాశం వచ్చింది. 'వంగవీటి' బయోపిక్‌ అది. నాకు ఆసక్తిగా అనిపించి చేద్దాం అనుకున్నా. కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల విశేషాలు చెబుతారా?

జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో 'రౌడీ బేబీ' చేస్తున్నా. యాక్షన్‌ నేపథ్యంతో అల్లుకున్న వినోదాత్మక ప్రేమకథ ఇది. నేను గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తా. తర్వాత 'వివాహ భోజనంబు' దర్శకుడితో ఓ సినిమా ఉంటుంది. ఆ తర్వాత రంజిత్‌ అనే మరో దర్శకుడితో చెయ్యాల్సి ఉంది. ఇప్పుడైతే వెబ్‌సిరీస్‌ల్లో నటించే ఆలోచనలు లేవు కానీ, మంచి కథ దొరికితే మా నిర్మాణ సంస్థలోనే తీయాలనుకుంటున్నా. 'వివాహ భోజనంబు'లో నెల్లూరు ప్రభ అనే అంబులెన్స్‌ డ్రైవర్‌ పాత్రలో నటించా. దాదాపు 20నిమిషాల నిడివి ఉండే ఆ పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది.

My first love was a Vizag girl, Says Sundeep Kishan
'వివాహ భోజనంబు' సినిమా పోస్టర్​

చిన్నప్పుడు ఆటలు బాగా ఆడేవాళ్లా?

ఆ ఆట.. ఈ ఆట అని లేదు.. అన్నింటిలోనూ వేలు పెట్టాం. బాగా ఇష్టమైనది మాత్రం స్విమ్మింగ్‌. సీబీఎస్‌ఈ స్థాయిలో 50మీటర్స్‌ స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో పాల్గొన్నా.

నీ ప్రేమకథల్ని తెరపైకి తీసుకు రావాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?

సినిమా తీసేంత ప్రేమకథలేమీ లేవు కానీ.. కొన్ని సన్నివేశాలకు మాత్రం నా కథలు పనికొస్తాయి. ఇలా కథలు, సన్నివేశాల గురించి ఆలోచిస్తుంటాను కానీ.... దర్శకత్వం చేయాలనే కోరిక మాత్రం లేదు. సెట్లో దర్శకుల్ని చూస్తుంటాం కదా.. 'అమ్మో ఆ కష్టం మనవల్ల కాదులే' అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నటన, నిర్మాణాన్ని ఆస్వాదిస్తున్నా.

మీరు ప్రేమ పెళ్లి చేసుకుంటారా లేక పెద్దలు కుదిర్చినదా?

మా ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి అన్న ప్రసక్తే లేదు. అసలు ఆ పద్ధతిని ఎలా ఫాలో అవ్వాలో కూడా తెలియదు (నవ్వుతూ). మా ఇంట్లో మొత్తం ప్రేమ వివాహాలే. మా తాతయ్యలతోపాటు అమ్మానాన్న, పెద్దనాన్న, బాబాయ్‌.. ఇలా అందరివీ ప్రేమ పెళ్లిళ్లే.

నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ వరుసగా సినిమాలు చేస్తున్నారు...

ఆ రెండిటినీ నేనెంతో ఇష్టపడతా. రెండూ చేస్తున్నప్పుడు భయంకరమైన ఒత్తిడి.. కష్టం ఉంటాయి. కానీ ఇలాంటి అవకాశం మళ్లీ రాదుకదా. కష్టాన్ని కూడా ఇష్టంతో భరిస్తూ ప్రయాణం చేస్తున్నా.

ఇదీ చూడండి: బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత అభిజీత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.