టాలీవుడ్లో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న సంగీత దర్శకుడు తమన్. 'రాములో రాములా', 'సామజవరగమన', 'కోకో కోలా పెప్సీ ఈ మామ అల్లుడు సెక్సీ' వంటి పాటలతో యూట్యూబ్‌ను హోరెత్తిస్తున్నాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు సంగీతమందించే అవకాశం కొట్టేశాడట. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కే చిత్రం కోసం తమన్‌ను ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమా? కాదా? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. జనవరి నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రచిత రామ్, విలన్‌గా రోజాను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది.
బోయపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన 'సింహ', 'లెజెండ్'లు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు చూస్తున్నారు.