'ఉండిపోవ నువ్విలా..' ఈ పాట ప్రస్తుతం యువతకు తెగ ఎక్కేసింది. ఈ గీతానికి కవర్ సాంగ్స్ అంటూ యూత్ తెగ సందడి చేస్తోంది. ఈ పాట విన్న వెంటనే మనకు మొదట వచ్చే సందేహం ఈ సాంగ్‌కి సంగీత దర్శకుడు ఎవరు అని. ఇంత బాగా కంపోజ్ చేసిన ఆ మ్యూజిక్ డైరక్టర్ ఎవరో కాదు శేఖర్ చంద్ర. ఇప్పటి వరకు నచ్చావులే, మనసారా, నువ్విలా, కార్తికేయ, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 118 వంటి బ్లాక్ బాస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు 'సవారి' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి పలకరించనున్నాడు. మొత్తంగా ఈ సంగీత దర్శకుడి కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
సవారి
నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో 'సవారి' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఇప్పటికే విడుదలైన 'ఉండిపోవ నువ్విలా', 'నీ కన్నులు, నా కన్నులు' అనే పాటలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. యూత్ ఆంథమ్‌లా మారిపోయిన ఈ సాంగ్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలైంది. అందులోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలరించేలా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
118
కల్యాణ్ రామ్, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా '118'. ఈ చిత్రంలో 'చందమామే' అనే పాట వినడానికి బాగుంటుంది. అలాగే ఈ థ్రిల్లర్ మూవీకి శేఖర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నిఖిల్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడ'. ఈ చిత్రంలో 'చిరునామా తన చిరునామా', 'నీతో ఉంటే చాలు' అనే పాటలు యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. 'మస్తు గుండేది లైఫ్' అనే సాంగ్ టిక్‌టాక్‌లో ట్రెండింగ్‌లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమా చూపిస్త మావ
రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఇందులో 'ఈ క్షణం', 'పిల్లి కల్ల పాప', 'మామ ఓ చందమామ' పాటలు అలరిస్తాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కార్తికేయ
నిఖిల్, స్వాతి జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ'. శేఖర్ చంద్ర కెరీర్లో ఇదొక మరిచిపోలేని ఆల్బమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులోని 'ఇంతలో ఎన్నెన్ని వింతలో', 'సరిపోవు భాషలెన్నైనా' అనే పాటలు మెలోడియస్గా బాగుంటాయి. ఇందులోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మేం వయసుకు వచ్చాం
తనీష్, నీతి టైలర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మేం వయసుకు వచ్చాం'. ఇందులోని 'వెళ్లిపోకే' అనే సాంగ్ బ్రేకప్ అయిన ప్రేమికులకు ఆంథమ్‌గా నిలిచిపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నువ్విలా
విజయ్ దేవరకొండ, యామీ గౌతమ్, హవీష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నువ్విలా'. ఇందులోని 'అర చేతిని వదలని' అనే సాంగ్ మెలోడియస్గా ఉండి శ్రోతలకు నచ్చుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మనసారా
విక్రమ్, శ్రీ దివ్య జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు రవిబాబు దర్శకుడు. ఇందులోని 'నువ్విలా ఒకసారిలా', 'పరవాలేదు పరవాలేదు' అనే పాటలు బాగా కనెక్ట్ అవుతాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నచ్చావులే
రవిబాబు, శేఖర్ చంద్ర కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు హైప్ రావడానికి ప్రధాన కారణం మ్యూజిక్. ఈ చిత్రంలోని 'పావుగంట తొమ్మిదయితే పద్మావతి', 'నిన్నే నిన్నే కోరా', 'మన్నించవా' అనే సాంగ్స్ అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ఇప్పటికీ యూత్ ఆదరించే పాటల్లో ఇవి ముందుంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. 'ఆ పాత్ర చేయడానికి ఏంజెలీనా జోలీ ఆదర్శం'