ETV Bharat / sitara

పోలీసుగా కీరవాణి నటించాల్సింది కానీ?

సంగీత దర్శకుడు కీరవాణికి ఓ సినిమాలో పోలీసుగా నటించే అవకాశమొచ్చింది. కానీ అది ఆయన నుంచి చేజారింది. అందుకు గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈయన వెల్లడించారు.

Music director Keeravani reveals he has get the chance of police role in Gharana Bullodu movie
పోలీసు ఆఫీసరుగా సంగీత దర్శకుడు కీరవాణి!
author img

By

Published : May 1, 2020, 1:37 PM IST

తెరవెనుక ఉండే దర్శకులు, సంగీత దర్శకులు అప్పుడప్పుడు తెరపై మెరిసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నిమిషంపాటైనా తళుక్కుమని మెరుస్తుంటారు. ఇలానే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న వేషం వేయాలనుకున్నారు. అయితే ఆయనకు ఓసారి అవకాశం వచ్చినా సమయాభావం వల్ల నటించలేకపోయారు.

అలా అవకాశం

కీరవాణి సతీమణికి పోలీసులంటే చాలా ఇష్టం. అనుకోకుండా సంగీత దర్శకుడ్ని పెళ్లి చేసుకోవడం వల్ల.. ఆమె కోరిక నెరవేర్చేందుకు ఈయన ఓ రోజు ఐపీఎస్‌ అధికారిగా వేషధారణ చేసుకున్నారు. ఆయనకు తెలిసిన ఓ వ్యక్తి, కొంచెం మేకప్‌ వేసి ఫొటో తీశారు. దానిని దర్శకుడు రాఘవేంద్రరావుకు చూపించి ఏదైనా పోలీసు వేషం ఉంటే ఇవ్వండని కీరవాణి సరదాగా అడిగారు.

ఈ క్రమంలోనే 'ఘరానా బుల్లోడు' సినిమాలో ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో కీరవాణిని నటించమన్నారు రాఘవేంద్రరావు. ఆ సమయంలో రికార్డింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతం అందించింది కీరవాణినే కావడం విశేషం. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ ,ఆమని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇదీ చూడండి : బాలకృష్ణ 'అఘోరా' పాత్రపై బోయపాటి క్లారిటీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.