'మీటూ' ఉద్యమంతో సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన నటి, మోడల్ తనుశ్రీ దత్తా. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. విచారణలో ముంబయి పోలీసులను నమ్మలేమని ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ముంబయి పోలీసులు ఈ విచారణలో న్యాయపరమైన, నిష్పక్షపాతంతో వ్యవహరిస్తారనే నమ్మకం నాకు లేదు. సాధారణంగా ఇటువంటి కేసులను త్వరగా మూసేయాలని వారు చూస్తుంటారు. ప్రస్తుతం ప్రజల్లో ఇది హాట్ టాపిక్‌గా ఉండటం వల్ల.. కొంత మందిని విచారణ పేరుతో పిలిచి.. షో చేస్తున్నారు అంతే. ఒకవేళ అండర్‌వరల్డ్ ప్రమేయం ఉంటే.. కచ్చితంగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలి."
-తనుశ్రీ దత్తా, సినీ నటి
బాలీవుడ్లో తన అనుభవం గురించి మాట్లాడుతూ.. తన విషయంలోనూ నెలల తరబడి శ్రద్ధతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు నటించారని తనుశ్రీ పేర్కొంది. సుశాంత్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం నిజంగా బాధాకరమని తెలిపింది.