- శశిధర్ పాఠక్, రాజకీయ విశ్లేషకుడు
సినీ గ్లామర్...! భాజపాకు కంచుకోటైన ఉత్తర ముంబయిలో ఊర్మిళను పోటీకి దింపడం వెనుక కాంగ్రెస్ కారణం ఇదే.
ఇవీచూడండి:
అప్పుడు ఎంపీ... ఇప్పుడు బీడీ కార్మికుడు
స్టార్టప్: మోదీ చర్యలు X రాహుల్ హామీలు
వారికి 'గ్లామర్' కొత్త కాదు...
ఉత్తర ముంబయిలో ఎప్పటినుంచో భాజపాదే హవా. 1989 నుంచి ఆ పార్టీ నేత రామ్ నాయక్ వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈ విజయపరంపరకు అడ్డుకట్ట వేసేందుకు 2004లో గ్లామర్ అస్త్రం ప్రయోగించింది కాంగ్రెస్. రామ్ నాయక్‌కు పోటీగా బాలీవుడ్ హీరో గోవిందను బరిలో నిలిపింది. కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. గోవింద ఘన విజయం సాధించారు.
2009 ఎన్నికల్లో గోవింద పోటీ చేయలేదు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ పోటీ చేసి గెలిచారు.
2014కు భాజపా తిరిగి పుంజుకుంది. సంజయ్‌పై గోపాల్ శెట్టి విజయం సాధించారు. ఉత్తర ముంబయి మాత్రమే కాదు మహారాష్ట్రవ్యాప్తంగా చతికిలపడింది కాంగ్రెస్. 48 లోక్‌సభ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కమలదళం ప్రభంజనం సృష్టించింది. భాజపా 23, మిత్రపక్షం 18 స్థానాల్లో గెలిచాయి.
లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు నిరాశే మిగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏదే హవా.
పుంజుకునేదెలా...?
మహారాష్ట్రలో ఐదేళ్లుగా వరుస ఓటములతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెట్టింది. రాష్ట్రంలోని ప్రతి సీటు విషయంలో విస్తృత కసరత్తు చేసింది.
ఉత్తర ముంబయిలో భాజపా సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టిని ఎదుర్కొనేందుకు ప్రజాకర్షణ ఉన్న అభ్యర్థి కోసం వెతికింది కాంగ్రెస్. ఇటీవలే పార్టీలో చేరిన ఊర్మిళ అందుకు సరైన వ్యక్తని నిర్ణయానికి వచ్చింది. ఆమెకు టికెట్ ఇచ్చింది.
ముంబయి పరిధిలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. గోవింద తరహాలో ఊర్మిళ విజయం సాధిస్తారా లేదా అన్నది మే 23న తేలనుంది.