బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి నివసిస్తున్న అపార్డ్మెంట్ని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మూసివేసింది. కరోనా కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ తెలిపింది. అపార్ట్మెంట్లో ఐదుగురు కరోనా రోగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దక్షిణ ముంబయిలోని ఆల్టామౌంట్ రోడ్లో ఉన్న పృథ్వీ అపార్ట్మెంట్లో సునీల్ నివసిస్తున్నారు. సునీల్ కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని సమాచారం.
ఇదీ చదవండి: రజనీ మక్కల్ మండ్రం రద్దు- సూపర్‌స్టార్ ప్రకటన