చైనా పురాణ యోధురాలి కథతో తీసిన చిత్రం 'ములన్'. సామాన్య యువతి, తన కుటుంబం కోసం, దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి గొప్ప యోధురాలిగా ఎలా మారిందో చెప్పిన సినిమానే ఇది. నిక్కీ కారో దర్శకత్వంలో హాలీవుడ్ నటి లియూ యిఫీ హువా ములన్‌గా నటించింది. శుక్రవారం(డిసెంబర్ 4న) డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చిత్రం విడుదలైన సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత బిల్ కాంగ్ ఆసక్తికర అంశాల్ని పంచుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 'ములన్' రిలీజైంది.
"ములన్'తో ప్రపంచంలోని ప్రతి ఒక్కరు సంబంధం ఉంటుంది. ఈ కథ ఎన్నో శతాబ్దాల కిత్రం నాటిది కావొచ్చు. కానీ ఆమె పాత్ర, చర్యలు నేటి మహిళలను ప్రతిబింబిచేలా ఉంటాయి. అందుకే ప్రస్తుత ప్రపంచానికి ములన్ కథ చాలా దగ్గరగా ఉంటుంది" బిల్ కాంగ్ అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథేంటంటే?
ఉత్తర ఆక్రమణదారుల నుంచి తమ దేశాన్ని రక్షించడానికి ప్రతి గడపకొకరు సైన్యంలో చేరాలని చైనా చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేస్తాడు. దాంతో ఆ దేశ సైన్యాధ్యుక్షుని కూతురు హువా ములన్ (లియు) ముందుకొస్తుంది. సైన్యంలో ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని, సైనికులతో కలిసి శత్రువుల భారీ నుంచి దేశాన్ని ఎలా కాపాడిందనేది చిత్రకథ.